ఆల్ టైం లో వద్ద `పేటీఎమ్`.. ఇన్వెస్టర్లకు భారీ నష్టాలు
1 min readపల్లెవెలుగువెబ్ : పేటీఎం షేర్లు సరికొత్త ఆల్ టైమ్ కనిష్టానికి చేరాయి. గత కొంతకాలంగా పేటీఎం షేర్లు దిగజారుతోన్న విషయం తెలిసిందే. గతేఏడాది నవంబరులో ఇష్యూ చేసిన రోజున రూ. 1,961 ధరతో పోల్చుకుంటే ఈ స్టాక్ దాదాపు 72 శాతం పడిపోయింది. బీఎస్ఈలో షేరు 4 శాతానికి పైగా పతనమై, రూ. 541.15 వద్ద ఆల్టైమ్ కనిష్ట స్థాయికి చేరుకుంది. సంస్థ మార్కెట్ క్యాప్ రూ. 35,915.27 కోట్లకు పడిపోయింది. గ్లోబల్ ఫైనాన్షియల్ మేజర్ మాక్వెరీ, బ్యాంకింగ్ లైసెన్స్ పొందే అవకాశాలు తగ్గుముఖం పట్టడంతోపాటు, రెగ్యులేటరీ హెడ్విండ్లను పేర్కొంటూ పేటీఎం కోసం దాని ధరల లక్ష్యాన్ని తగ్గించింది.