PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అలా అంటే అన్న‌య్య ఒప్పుకోడు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ‘‘అన్నయ్య వరుసగా సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘ఇప్పుడు కూడా ఎందుకు అన్నయ్య ఇంత కష్టపడుతున్నావ్‌’ అని మేం అడుగుతుంటాం. ‘అభిమానుల కోసం చేసే ఏ పనైనా ఇష్టంతో చేస్తాను కాబట్టి అందులో కష్టం నాకు తెలీదు. దయచేసి దీనిని కష్టం అని అనవద్దమ్మా’ అని సున్నితంగా చెప్పారు. అభిమానుల అండదండలు మా కుటుంబానికి భగవంతుడు ఇచ్చిన వరం. వారి ప్రేమ మా కుటుంబపై ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా’’ అని చిరంజీవి సోదరి మాధవి అన్నారు. ఆదివారం రామ్‌చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా శిల్పకళావేదికలో అభిమానులు భారీ ఎత్తున ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. 24 ఏళ్ల క్రితం చిరంజీవిగారికి వచ్చిన బ్లడ్‌బ్యాంక్‌ ఆలోచన ఎంతో మందిని కాపాడుతుందని ఆమె కొనియాడారు.

                                     

About Author