పవన్ కళ్యాణ్ రంజాన్ శుభాకాంక్షలు
1 min read
పల్లెవెలుగువెబ్ : రంజాన్ ఉపవాస దీక్షలు పవిత్రమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఇస్లాం మతం పాటించే ప్రతి ఒక్క ముస్లిం సోదరుడికి తన తరఫున, జనసేన పక్షాన పవన్ కల్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసాన్ని ముస్లింలు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ముస్లింలు నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. ఉదయం ఉపవాస దీక్షను ప్రారంభించి సాయంత్రం ఇఫ్తార్‌తో ఉపవాస దీక్షలను ముగిస్తారు. రంజాన్ మాసం సందర్భంగా మసీదులను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు.