పది లక్షల ఉద్యోగాలు !
1 min readపల్లెవెలుగువెబ్ : ఆస్ట్రేలియాతో శనివారం కుదుర్చుకున్న ఒప్పందం వల్ల రానున్న నాలుగైదు సంవత్సరాల్లో దాదాపు 10 లక్షల ఉద్యోగావకాశాలు కొత్తగా వస్తాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. ద్వైపాక్షిక వాణిజ్యం 27 బిలియన్ డాలర్ల నుంచి 45-50 బిలియన్ డాలర్లకు పెరగడానికి ఈ ఒప్పందం దోహదపడుతుందన్నారు. భారత్, ఆస్ట్రేలియా ప్రధాన మంత్రులు నరేంద్ర మోదీ, స్కాట్ మారిసన్ల సమక్షంలో ఇరు దేశాల వాణిజ్య మంత్రులు పీయూష్ గోయల్, డాన్ టెహాన్ ఇండియా-ఆస్ట్రేలియా ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్‌పై శనివారం సంతకాలు చేశారు. వర్చువల్ విధానంలో జరిగిన కార్యక్రమంలో ఈ ఒప్పందం కుదిరింది.