అది ఆహార కొరతకు దారితీస్తుంది !
1 min readపల్లెవెలుగువెబ్ : పాశ్చాత్య దేశాల ఆంక్షల దాడిని రష్యా విజయవంతంగా తట్టుకుందని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ఆంక్షలు అంతిమంగా వాటికే బెడిసికొడతాయన్నారు. ‘‘రష్యా, బెలారస్ ఎరువుల ఎగుమతులపై నిషేధం వల్ల ప్రపంచవ్యాప్తంగా వాటి ధరలకు రెక్కలొస్తాయి. ఇది అంతిమంగా అంతర్జాతీయ ఆహార కొరతకు, వలసలకు దారి తీస్తుంది’’ అన్నారు. ‘‘విదేశీ శక్తులు మమ్మల్ని ఎప్పటికీ ఏకాకి చేయలేవు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ దేశాన్నీ ఏకాకిగా మార్చలేం. రష్యా వంటి అతి పెద్ద దేశం విషయంలో అది అసలే సాధ్యం కాదు’’ అని స్పష్టం చేశారు.