రెండో రోజు నష్టాలే !
1 min readపల్లెవెలుగువెబ్ : దేశీయ స్టాక్ మార్కెట్ లో వరుసగా రెండో రోజు ఇన్వెస్టర్లు నష్టాలను చవి చూశారు. రిలయన్స్ షేర్ల ధర ఆల్‌టైం హైకి చేరుకున్నా.. మిగిలిన అంశాలు మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపించాయి. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా మరింత దూకుడు పెంచింది. పోలాండ్, బెల్జియం దేశాలకు ఆయిల్ సరఫరా నిలిపేస్తున్నట్టు ప్రకటించడంతో ప్రపంచ మార్కెట్లు కుదుపుకు గురయ్యాయి. ఇప్పటికే ద్రవ్యోల్బణం ఎలా అదుపు చేయాలో తెలియక సతమతం అవుతుంటే యుద్ధం మరింతగా ముదురుతుండటం ఇన్వెస్టర్లను కలవరపాటుకు గురి చేసింది. మార్కెట్ ముగిసే సమయానికి 556 పాయింట్ల నష్టంతో 56,800ల పాయింట్ల దగ్గర ముగిసింది. నిఫ్టీ 168 పాయింట్లు నష్టపోయి 17,032 పాయింట్ల దగ్గర క్లోజయ్యింది.