కరోన నష్టాల్ని పూడ్చాలంటే.. ఎన్నేళ్లు పడుతుందంటే ?
1 min readపల్లెవెలుగువెబ్ : భారత ఆర్థిక వ్యవస్థకు కోవిడ్ మహమ్మారి వల్ల వాటిల్లిన నష్టాలను పూడ్చుకోవడానికి 12 ఏళ్లు పట్టవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక వెల్లడించింది. మహమ్మారి వ్యాప్తి కాలంలో దాదాపు రూ.52 లక్షల కోట్ల మేర ఉత్పత్తి నష్టం జరిగిందని అంచనా వేసింది. ‘‘రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో కమోడిటీ ధరల పెరుగుదల, ప్రపంచ సరఫరా వ్యవస్థ అంతరాయాల కారణంగా ప్రపంచ, దేశీయ వృద్ధికి ఆటంకాలు అధికం అవుతున్నాయి. 2022–23 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు అంచనా 7.2 శాతం. ఆ తర్వాత 7.5 శాతంగా ఉంటుందని ఊహిస్తే.. భారత్ 2034–35లో కోవిడ్ నష్టాలను అధిగమించగలదని అంచనా’’ అని నివేదిక వివరించింది.