PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘కిమ్స్​’లో… కాలేయం దెబ్బతిన్న వ్యక్తికి శస్త్రచికిత్స

1 min read

* ద్వితీయశ్రేణి నగరాల్లో అరుదుగా జరిగే పరిణామం

* విజయవంతంగా చేసిన కర్నూలు కిమ్స్ ఆస్పత్రి వైద్యులు

పల్లెవెలుగు వెబ్​: రోడ్డుప్రమాదంలో కాలేయం తీవ్రంగా దెబ్బతిన్న వ్యక్తికి హైదరాబాద్ లాంటి పెద్ద నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా కర్నూలులోనే విజయవంతంగా శస్త్రచికిత్స చేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించారు.. కిమ్స్ ఆస్పత్రి వైద్యులు. రోగి పరిస్థితిని, తాము చేసిన చికిత్స విధానాన్ని వైద్యులు వివరించారు. ‘‘వెంకటశివుడు (27) అనే యువకుడు నంద్యాల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. కుడిచేతి చిటికెన వేలు, ఎడమచేతి బొటనవేలు విరగడంతో పాటు, అంతర్గత రక్తస్రావం అవుతున్న లక్షణాలు కనిపించాయి. తొలుత స్థానికంగా వైద్యుల వద్దకు వెళ్లగా, స్కానింగ్ చేసి కాలేయం (లివర్) దెబ్బతిందని, లోపల రక్తస్రావం అవుతోందని గుర్తించి కర్నూలుకు వెళ్లాల్సిందిగా సూచించారు. కిమ్స్ ఆస్పత్రికి రాగానే ఇక్కడ పరీక్షలు చేసినప్పుడు అతడికి కాలేయం గాయపడినట్లు గుర్తించాం. అయితే బీపీ, ఇతర పారామీటర్లు అన్నీ స్థిరంగానే ఉండటంతో.. పరిశీలనలో ఉంచాం. సాధారణంగా కాలేయం దానంతట అదే సర్దుకునే అవకాశాలుంటాయి. రెండోరోజు పరిశీలించినప్పుడు హెమోగ్లోబిన్ స్థాయి తగ్గుతున్నట్లు గుర్తించాం. అంటే, అంతర్గత రక్తస్రావం ఆగలేదని గుర్తించి, అప్పుడు లివర్ శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించాం. కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్ జానకిరామ్ ఎస్.జె. ఈ శస్త్రచికిత్స చేశారు. తెరిచి చూసినప్పుడు కాలేయంలో కొంతభాగం అప్పటికే పాడైంది. ఆ పాడైన భాగాలను తొలగించి, మిగిలిన భాగానికి కుట్లు వేసి రక్తస్రావాన్ని అరికట్టాం. మనిషి శరీరంలో కాలేయం ఒక్కటే తనంతట తానుగా పెరిగే లక్షణం కలిగి ఉంటుంది. అందువల్ల కొంత భాగం తొలగించినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అతడిని ఐసీయూలో ఉంచి తగిన మందులతో చికిత్స చేసిన తర్వాత పూర్తిగా కోలుకున్నాడు. అనంతరం కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కిరణ్ అతడి విరిగిన చేతి వేళ్లకు అవసరమైన శస్త్రచికిత్స చేశారు. దాంతో వెంకటశివుడు పూర్తిగా కోలుకున్నారు’అని వివరించారు. ఈ చికిత్స ప్రక్రియలో సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్ జానకిరామ్ ఎస్.జె., కన్సల్టెంట్ ఆర్థోపెడీషియన్ డాక్టర్ కిరణ్, అనెస్థటిస్టు డాక్టర్ శృతి, ఐసీయూ కన్సల్టెంట్ డాక్టర్ శరత్ తదితరులు పాల్గొన్నారు. సాధారణంగా కాలేయ శస్త్రచికిత్సలు చేయాలంటే కాలేయమార్పిడి నిపుణులు గానీ, లేదా కాలేయానికి చికిత్స చేయడంలో నైపుణ్యం ఉన్న సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టులు గానీ అవసరం అవుతారు. అలాంటివాళ్లు హైదరాబాద్, బెంగళూరు లాంటి పెద్ద నగరాల్లోనే ఉంటారు. ద్వితీయశ్రేణి నగరాల్లో మత్తువైద్య నిపుణులు, కాలేయ నిపుణులు, ఆర్థోపెడిక్ నిపుణులు అంతా ఒకచోట ఉండటం మామూలుగా కష్టం. కానీ, కిమ్స్ ఆస్పత్రిలో అందరూ ఒకేచోట అందుబాటులో             ఉండటం, అత్యాధునిక వైద్య సదుపాయాలు కూడా ఉండటంతో ఇలాంటి సంక్లిష్టమైన కేసులకు సైతం కర్నూలు లాంటి చిన్న నగరాల్లో చికిత్స చేయడం సాధ్యమవుతోంది. భవిష్యత్తులోనూ ఇలాంటి అరుదైన కేసులు వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ వర్తిస్తుందో లేదో తెలియని ఇతర రాష్ట్రాలకు వెళ్లడం కంటే సకల సదుపాయాలున్న కర్నూలు కిమ్స్ ఆస్పత్రిలోనే వైద్యం చేయించుకోవచ్చని వెంకటశివుడు ఈ సందర్భంగా చెప్పారు. తనకు పూర్తిస్థాయిలో నయం చేసిన వైద్యులకు, కిమ్స్ ఆస్పత్రి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.

About Author