నిరసనకారుల దాడిలో ఎంపీ మృతి !
1 min readపల్లెవెలుగువెబ్ : శ‌్రీలంక రాజధాని కొలంబోలో సోమవారం నిరసనలు తారాస్థాయికి చేరుకున్నాయి. రాజపక్సే మద్దతుదారులు నిరసనకారులను కర్రలతో చితకబాదారు. పోలీసులు నిరసనకారులపై టియర్ గ్యాస్, వాటర్ కెనన్లను ప్రయోగించారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో అధికార పార్టీకి చెందిన ఎంపీ అమరకీర్తి అత్తుకోరల నిరసనకారుల పై కాల్పులు జరిపారు. ఈ ఫైరింగ్‌లో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆగ్రహానికి లోనైన నిరసనకారులు ఆయన కారును అడ్డగించారు. ఈ క్రమంలో ఆయనపై దాడి చేయడంతో అమరకీర్తి మృతిచెందినట్టు లంక మీడియా తెలిపింది. తీవ్ర ఉద్రిక్తకర పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు కొలంబోలో కర్ఫ్యూ విధించారు.