సీఐడీ అదుపులో మాజీమంత్రి నారాయణ
1 min read
పల్లెవెలుగువెబ్ : ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారాయణను ఏపీ సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉదయం ఏపీ నుంచి హైదరాబాద్ వచ్చిన సీఐడీ అధికారులు కొండాపూర్‌లోని నివాసంలో నారాయణను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని విశ్వసనీయవర్గాల సమాచారం. నారాయణను ఆయన సొంతకారులోనే ఏపీకి తరలిస్తున్నారు. నారాయణ వెంట ఆయన సతీమణి కూడా ఉన్నారు. మరోవైపు టోల్‌గేట్ దగ్గరికి పెద్ద ఎత్తున నారాయణ విద్యాసంస్థల సిబ్బంది చేరుకుంటున్నారు.