తెలంగాణలో కొత్త రకం కరోన వైరస్.. !
1 min readపల్లెవెలుగువెబ్ : భారత్‌లో తొలి ఒమిక్రాన్ ఉప వేరియెంట్ బీఏ.4 కేసు వెలుగు చూసింది. హైదరాబాద్‌లో నమోదు అయ్యింది. ఈ మేరకు ఇండియన్ సార్స్ కోవ్-2 కన్షార్షియం ఆన్ జీనోమిక్స్ ధృవీకరించింది. కోవిడ్-19 జెనోమిక్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది. ఈ నెల 9వ తేదీన ఈ కేసు నమోదు అయ్యిందని, ఆఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తి శాంపిల్‌లో ఈ సబ్‌వేరియెంట్ వెలుగు చూసిందని ఇన్సాకాగ్ వెల్లడించింది. దక్షిణాఫ్రికాతో పాటు చాలా దేశాల్లో కరోనా కేసులు విజృంభణకు కారణమైంది ఈ ఒమిక్రాన్ సబ్‌వేరియెంట్. ఈ తరుణంలో తొలి కేసు వెలుగు చూడడంతో.. భారత వైద్య పరిశోధన మండలి ఆందోళన వ్యక్తం చేస్తోంది. రాబోయే రోజుల్లో కేసులు పెరిగే అవకాశాలు ఉన్నాయని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది.