వారి పట్ల అవమానకరంగా ప్రవర్తించకండి : ఐసీఏఐ
1 min readపల్లెవెలుగువెబ్ : విచారణ సంస్థలు ఇటీవలి కాలంలో చార్టర్డ్ అకౌంటెంట్ల అరెస్ట్ చేయడం.. వారి పట్ల అవమానకరంగా ప్రవర్తించడంపై ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఆందోళనం వ్యక్తం చేసింది. ఈ అంశంపై ఐసీఏఐ కౌన్సిల్ శనివారం చర్చించింది. కొంతమంది విచారణ అధికారులు సీఏలను విచారించే సమయంలో అవమానకరంగా ప్రవర్తించడాన్ని ఐసీఏఐ కౌన్సిల్ సభ్యులు తీవ్రంగా ఖండించారు. ఏ మాత్రం ఆలోచించకుండా నేరుగా అరెస్ట్ చేస్తున్నారని పేర్కొన్నారు. అసలు తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా.. సీఏల పట్ల అవమానకరంగా ప్రవర్తించడాన్ని, అరెస్ట్ చేయడాన్ని దేశవ్యాప్తంగా సీఏలు వ్యతిరేకిస్తున్నట్లు ఐసీఏఐ పేర్కొంది.