చక్కెర ధరలకు రెక్కలు రానున్నాయా ?
1 min readపల్లెవెలుగువెబ్ : ధరలు పెరిగే అవకాశం ఉండటంతో చక్కెర ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించనుందంటూ ప్రముఖ వార్తా సంస్థలు రాయిటర్స్, బ్లూంబర్గ్‌లు కథనాలు ప్రచురించాయి. ఈ ఏడాది చక్కెర ఎగుమతులను కేవలం 10 మిలియన్ టన్నులకే పరిమితి చేసే అవకాశం ఉందంటూ తేల్చి చెప్పాయి. బయటి దేశాల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఎక్కువ మొత్తంలో ఎగుమతి చేస్తే దేశీయంగా కొరత వచ్చి ధరలు పెరగవచ్చనే అంచనాతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవచ్చంటూ వార్తలు వస్తున్నాయి. చక్కెర ఎగుమతుల పై పరిమితి విధించకపోతే దేశీయంగా ధరలకు రెక్కలు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.