లంక బాటలో పాక్.. సంక్షోభం ముంగిట్లో దేశం !
1 min readపల్లెవెలుగువెబ్ : పాకిస్థాన్ కూడ శ్రీలంక బాట పట్టే అవకాశం కనిపిస్తోంది. ఆసియాలో శ్రీలంక తర్వాత పాక్‌లోనే ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంది. ఇంధనం ధరల పెరుగుదలపై ప్రజల్లో నిరసన వ్యక్తమవుతోంది. మరోవైపు దేశంలో పెట్టుబడులు పెట్టడానికి విదేశీ ఇన్వెస్టర్లు మొహం చాటేస్తున్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 16.2శాతం తగ్గాయి. అయితే… ఇదే కాలంలో భారత్‌లో ఎఫ్‌డీఐలు రికార్డు స్థాయికి చేరడం విశేషం. కాగా.. తక్షణం 3 బిలియన్ డాలర్ల ప్యాకేజీ కావాలని ఐఎంఎఫ్‌ను పాక్ కోరింది. ప్రస్తుతం పాక్ వద్ద ఉన్న విదేశీ మారక నిల్వలు 2 నెలలపాటు దిగుమతులకు మాత్రమే సరిపోతాయి. విదేశీ రుణాలను చెల్లించే విషయంలో పాక్ త్వరలోనే డిఫాల్ట్ అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.