పవన్ కళ్యాణ్ కు కేఏ పాల్ బంపర్ ఆఫర్ !
1 min read
పల్లెవెలుగువెబ్ : పవన్ కల్యాణ్‌కు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. పవన్ తన పార్టీని వదిలి ప్రజాశాంతి పార్టీలో చేరితే ఎమ్మెల్యేనో, ఎంపీగానో గెలిపిస్తానన్నారు. గెలిపించలేకపోతే రూ.1000 కోట్ల నజారానా ఇస్తానన్నారు. పవన్ సొంతంగా పోటీ చేసినా మరే ఇతర పార్టీలతో కలిసి పోటీ చేసినా గెలవడని కేఏ పాల్ తేల్చిచెప్పారు. పవన్ బీజేపీతో పొత్తులో ఉండి బైబిల్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని కేఏ పాల్ అన్నారు.