భారీ నష్టాలు.. వేల కోట్ల సంపద ఆవిరి !
1 min readపల్లెవెలుగువెబ్ : అంతర్జాతీయ పరిణామాలు స్టాక్‌మార్కెట్‌ను కలవర పెడుతున్నాయి. అంతర్జాతీయంగా పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం కట్టడి చేసేందుకు వివిధ దేశాలు అనుసరిస్తున్న వ్యూహాలు స్టాక్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు, అదుపులోకి రాని క్రూడ్ ఆయిల్ ధరలు, చైనాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు అన్ని మార్కెట్లను అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు జాగ్రత్త పడుతున్నారు. మార్కెట్ నుంచి పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నారు. దీంతో పెద్దఎత్తున సెన్సెక్స్, నిఫ్టీలు నష్టపోయాయి. ఆరంభంలోనే సెన్సెక్స్ 1200 పాయింట్లు, నిఫ్టీ 390 పాయింట్లకు పైగా నష్టపోయింది.