చైనాకు ఏలియన్స్ సంకేతాలు ?
1 min readపల్లెవెలుగువెబ్ : భూగ్రహానికి వెలుపల నుంచి చైనా టెలిస్కోప్‌కు అందిన సంకేతాలు గ్రహాంతరవాసులు పంపించినవేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తమ దేశానికి చెందిన భారీ టెలిస్కోప్ ‘స్కై ఐ’ ఇటివల తక్కువ స్థాయి-బ్యాండ్ ఎలక్ట్రోమేగ్నెటిక్ సిగ్నల్స్‌ను గుర్తించిందని చైనా వెల్లడించింది. ఈ సంకేతాలు గ్రహాంతరవాసుల నుంచే వచ్చివుండొచ్చని చైనా సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ అధికారి న్యూస్‌పేపర్‌కు చెందిన వెబ్‌సైట్‌లో ఒక రిపోర్టును ప్రచురించింది. కానీ ఆ తర్వాత రిపోర్ట్, పోస్టును డిలీట్ చేసింది. రిపోర్టును ఎందుకు డిలీట్ చేసిందానేది తెలియరాలేదు. కాకపోతే డిలీట్ చేసేలోపే చైనా మైక్రోబ్లాకింగ్ నెట్‌వర్క్ ‘విబో’పై ఈ రిపోర్ట్ వైరల్‌గా మారింది. ఆ తర్వాత ఇతర మీడియా సంస్థలకు కూడా చేరడంతో రిపోర్టును వెల్లడించాయి.