రూ.77.5 లక్షలు పట్టివేత
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు క్రైం : జిల్లా సరిహద్దు పంచలింగాల చెక్ పోస్టు వద్ద వాహనాలు తనిఖీలో రూ.77.5 లక్షలు పట్టుకున్నారు సెబ్, లోకల్ పోలీసులు. హైదరాబాద్– బెంగుళూరుకు వెళ్లే గరుడ ప్లస్ బస్సు ‘TS 16 Z 0231) లో తెల్లవారు జామున 2.45 గంటలకు తనిఖీ చేయగా మధురాజ్ షణ్ముగ సుందరం వద్ద ఎటువంటి ఆధారాలు లేని రూ.77.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ ఫక్కీరప్ప, సెబ్ ఏఎస్పీ గౌతమిసాలి ఆదేశాల మేరకు వాహనాలు తనిఖీ చేస్తున్నామని పేర్కొన్న సెబ్ సీఐ లక్ష్మి దుర్గయ్య.. సీజ్ చేసిన నగదును తాలూకా పోలీస్ స్టేషన్లో అప్పగించామని వెల్లడించారు. తనిఖీలో ఎస్ఐ జీలాన్ బాషా, హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరులు, కానిస్టేబుల్స్… ఇమాం బాషా, సుధాకర్ ,విజయ్ భాస్కర్,సుబాన్ వాలిరామకృష్ణ మరియు గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.