NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కుప్ప‌కూలిన స్టాక్ మార్కెట్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : భార‌త స్టాక్ మార్కెట్లు కుప్ప‌కూలాయి. ఉదయం భారీ లాభాలతో ఊరించిన కీలక సూచీలు మ‌ధ్యాహ్నం నుంచి కనిష్ట స్థాయిలను నమోదు చేశాయి. ఇన్వెస్టర్ల అమ్మకాలతో 15451వద్ద నిఫ్టీ 52 వారాల దిగువకు చేరింది. అటు సెన్సెక్స్‌ కూడా 52 వారాల కనిష్టానికి అతి సమీపంలో ఉంది. బ్యాంక్‌ నిఫ్టీ ఏకంగా వెయ్యి పాయింట్లు పతనమైంది. మార్కెట్ ముగిసే స‌మ‌యానికి సెన్సెక్స్ 1000 పాయింట్ల పైగా న‌ష్ట‌పోయింది. నిఫ్టీ 340 పాయింట్ల దాక న‌ష్ట‌పోయింది. ఫెడ్ వ‌డ్డీరేట్ల పెంపుతో ఇన్వెస్ట‌ర్ల‌లో భ‌యం ప‌ట్టుకుంది. వృద్ధి మంద‌గించ‌డం, ధ‌ర‌లు పెర‌గ‌డం, నిరుద్యోగం పెరిగే అవ‌కాశం ఉండ‌టంతో అమెరికాలో ఆర్థిక మాంద్యం భ‌యాలు ఇన్వెస్ట‌ర్ల‌లో నెల‌కొన్నాయి. దీంతో అమ్మ‌కాలు వెల్లువెత్తాయి.

                                       

About Author