ఏపీలో పెరిగిన బస్ చార్జీలు
1 min readపల్లెవెలుగువెబ్ : ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. బస్సు చార్జీలను పెంచింది. పెరిగిన టికెట్ ధరలు రేపటి నుంచే అమల్లోకి వస్తాయి. డీజిల్ సెస్ పెంపుతో బస్సు చార్జీలను పెంచక తప్పడం లేదని ఆర్టీసీ ఎండీ తిరుమలరావు పేర్కొన్నారు. అయితే సీటీ బస్సులకు మినహాయింపు ఇస్తున్నామన్నారు. పల్లె వెలుగు, ఆర్డినరీ సర్వీసుల్లో అదనంగా రూ.2, ఎక్స్ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో రూ.5, ఏసీ బస్సుల్లో రూ.10 అదనంగా పెంచుతున్నామన్నారు.