అదరగొట్టిన డీమార్ట్ !
1 min readపల్లెవెలుగువెబ్ : డీమార్ట్ స్టోర్ల నిర్వాహక కంపెనీ ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ 2022–23 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్లో నికర లాభం పలు రెట్లు ఎగసి రూ. 643 కోట్లకు చేరింది. గతేడాది ఇదే కాలంలో కేవలం రూ. 95 కోట్లు ఆర్జించింది. ఇందుకు భారీ రికవరీ, గతంలో అతి తక్కువగా నమోదైన లాభాలు కారణమయ్యాయి. మొత్తం ఆదాయం సైతం 94 శాతం జంప్‌చేసి రూ. 10,038 కోట్లను అధిగమించింది. గతేడాది క్యూ1లో రూ. 5,183 కోట్ల అమ్మకాలు మాత్రమే సాధించింది. అమ్మకాలలో భారీ రికవరీ నమోదైనప్పటికీ గత క్యూ1లో కోవిడ్–19 రెండో దశ ప్రభావంచూపడంతో ఫలితాలను పోల్చిచూడతగదని ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ సీఈవో, ఎండీ నెవిల్లే నొరోనా తెలిపారు.