ఇండియాలో ఉత్తమ విద్యాసంస్థలు ఇవే !
1 min readపల్లెవెలుగువెబ్ : దేశంలోని విద్యాసంస్థలకు కేంద్రం ర్యాంకులు ప్రకటించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ ర్యాంకులు వెల్లడించారు. అన్ని విభాగాల్లో ఐఐటీ మద్రాస్ అగ్ర భాగాన నిలిచింది. రెండో స్థానంలో ఐఐఎస్ బెంగళూరు, మూడో స్థానంలో ఐఐటీ ముంబై నిలిచింది. ఇక యూనివర్సిటీల్లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌కు తొలిస్థానం దక్కగా.. రెండో స్థానంలో జేఎన్‌యూ ఢిల్లీకి దక్కింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పదో స్థానంలో నిలిచింది. ఇక ఇంజనీరింగ్ విభాగంలో ఐఐటీ మద్రాస్‌కు తొలిస్థానం దక్కగా.. ఐఐటీ ఢిల్లీకి రెండో స్థానం, ఐఐటీ హైదరాబాద్‌కు 9వ స్థానం లభించింది. ఇక ఫార్మసీ విభాగంలో జామియా హమ్దార్ద్‌కు తొలిస్థానం దక్కగా.. హైదరాబాద్‌లోని నైపర్‌కి రెండో స్థానం దక్కింది.