NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అహోబిలంలో ఆగ్ర‌హించిన మాజీ మంత్రి అఖిల ప్రియ

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : అహోబిలంలో అఖిలప్రియ కారుకు టోల్‌గేట్ వసూలు చేయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిక ధరతో టోల్ ఫీజు వసూలు చేస్తున్నారంటూ అక్కడిక్కడే అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. టోల్‌గేట్ నిర్వాహకులపై ఇప్పటికే అనేకసార్లు ఆరోపణలు వచ్చాయని మరోసారి ఇదే రిపీట్ అయితే కలెక్టర్‌కు కంప్లెయింట్ చేస్తానంటూ ఆమె హెచ్చరించారు. ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలం గ్రామానికి మాజీ మంత్రి అఖిలప్రియ శనివారం వెళ్లగా.. అక్కడ టోల్ గేట్ సిబ్బంది కారుని ఆపి టోల్ ఫీజు కట్టాలని కోరారు. నిబంధనల ప్రకారం పంచాయతీ అధికారులు నిర్ణయించిన ధర కాకుండా అధికంగా రూ.150 వసూలు చేస్తున్నారంటూ ఆమె మండిపడ్డారు. అక్కడ పనిచేస్తున్న టోల్ సిబ్బందితో రిసిప్ట్ తీసుకుని.. అక్కడ నుంచి పంచాయతీ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. టోల్ గేట్ నిర్వహణపై ఇప్పటికే ఆరోపణలు వచ్చాయని.. మరోసారి ఇలాగే జరిగితే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా కోర్టుకు వెళ్తానంటూ హెచ్చరించారు. భక్తుల దగ్గర ఇష్టానుసారం దోచుకుంటే సహించేది లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

                                         

About Author