PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సోంపు గింజ‌ల వ‌ల్ల లాభాలేంటో తెలుసా ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : వంటింట్లో చేసే కొన్ని రకాల తీపి పదార్థాల తయారీలో సోంపు గింజలను కూడా ఉపయోగిస్తుంటాం. సోంపు గింజలను వాడడం వల్ల తీపి పదార్థాల రుచి పెరుగుతుంది. అంతేకాకుండా గింజలను తినడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. తరచూ సోంపు గింజలను తింటూ ఉండడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందొచ్చు. సోంపు గింజలు ఔషధ గుణాలను కూడా కలిగి ఉంటాయి. మనలో చాలా మంది భోజనం చేసిన తరువాత సోంపు గింజలను తింటూ ఉంటారు. ఇలా తినడం వల్ల తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. సోంపు గింజలను ఉపయోగించి మనకు వచ్చే చిన్నచిన్న అనారోగ్య సమస్యలను మనం నయం చేసుకోవచ్చు. వీటిని సంస్కృతంలో మధురిక అని అంటారు. వీటిని తిన్న వెంటనే వేడిచేసి తరువాత చలువు చేసే గుణాన్ని కలిగి ఉంటాయి. సోంపు గింజలను తినడం వల్ల జీర్ణాశయానికి, గుండెకు, మెదడుకు బలం చేకూరుతుంది. వాత రోగాలను నయం చేయడంలో ఈ గింజలు ఎంతగానో ఉపయోగపడతాయి.

                                                 

About Author