అమెరికా భారీ సహాయం
1 min read
పల్లెవెలుగు వెబ్: కరోన మహమ్మారి మీద పోరాడుతున్న భారత్ కు అమెరికా దన్నుగా నిలిచింది. ఆపత్కాలంలో ఆదుకుంటామని ముందుకొచ్చింది. భారత వైద్య సిబ్బందికి అవసరమైన సామాగ్ర, అత్యవసర సమయంలో అవసరమైన వైద్య సామాగ్రి అందిస్తామని అమెరికా ప్రకటించింది. దీని విలువ దాదాపు 100 మిలియన్ డాలర్లు ఉంటుంది. 1000 ఆక్సిజన్ సిలిండర్లు, 15 మిలియన్ల ఎన్-95 మాస్కులు, 1 మిలియన్ రాపిడ్ కిట్లు పంపనున్నారు. ఆస్ట్రాజెన్కా టీకాకు సంబంధిచిన సామాగ్రి కూడ భారత్ కు పంపనున్నట్టు అమెరికా ప్రకటించింది. ఈ సామాగ్రి అమెరికా నుంచి గురువారం బయలుదేరనుంది.