భారత్ లో జీహాదీ భావజాల వ్యాప్తి !
1 min readపల్లెవెలుగువెబ్ : ఇటీవల అసోంలో పట్టుబడ్డ అల్ కాయిదా ఇన్ ఇండియన్ సబ్-కాంటినెంట్(ఏక్యూఐఎస్), దాని అనుబంధ సంస్థ అన్సారుల్ బంగ్లా టీమ్(ఏబీటీ) ఉగ్రవాదులు భారత్లో జిహాదీ భావజాలాన్ని వ్యాపింపజేసేందుకు భారీ కుట్ర పన్నినట్లు పోలీసులు నిగ్గుతేల్చారు. ఇప్పటికిప్పుడు దేశంలో విధ్వంసాలకు పథకాలు రూపొందించలేదని.. అయితే, తొలుత జిహాదీ భావజాలాన్ని విస్తరించడం.. స్లీపర్సెల్స్ను భారీగా రిక్రూట్ చేసుకోవడం వీరి ప్రధాన టాస్క్ అని గుర్తించారు.