సోషల్ మీడియా కట్టడికి కొత్త చట్టం !
1 min readపల్లెవెలుగువెబ్ : సోషల్ మీడియా కట్టడికి కేంద్రం సిద్ధమవుతోంది. సామాజిక మాధ్యమాలను ప్రభావితం చేసేవారి కోసం త్వరలోనే కొత్త మార్గదర్శకాలను తీసుకురానుంది. ఇవి అమల్లోకి వస్తే సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసేవారికి అడ్డుకట్ట పడనుంది. అలాగే సోషల్ మీడియాలో ఏదైనా ఒక బ్రాండ్‌ను ప్రమోట్ చేసే ఎవరైనా సరే దాని గురించి స్పష్టమైన, వాస్తవమైన సమాచారం అందించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ.10 లక్షల జరిమానా విధించనున్నారు. పదేపదే ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.50 లక్షల భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఎంత పెద్ద సెలెబ్రిటీ అయినా సరే జరిమానా కట్టాల్సిందే. తప్పుడు సమాచారం, తప్పుదోవ పట్టించే ప్రకటనల నుంచి ప్రజలను రక్షించే ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.