ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ.. నూతన బాడీ కమిటీ ఎన్నిక
1 min read: డీఆర్ఓ నాగేశ్వర రావు
పల్లెవెలుగు వెబ్ : కర్నూలు జిల్లాలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో ఏకగ్రీవంగా నూతన బాడీ కమిటీ ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందని జిల్లా రెవెన్యూ అధికారి నాగేశ్వర రావు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జనరల్ బాడీ మీటింగ్ జిల్లా రెవెన్యూ అధికారి నాగేశ్వర రావు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ కర్నూలు జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో 7 వేల మంది సభ్యులు ఉన్నారని అన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు పేద ప్రజలకు ఎన్నో రకాల సేవలు అందించారని ముఖ్యంగా రక్తదానం ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడరని అన్నారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాలోను నూతన బాడీ కమిటీ ఏర్పాటు చేసుకున్నారని ఈరోజు మన కర్నూలు జిల్లాలో కూడ ఏకగ్రీవంగా నూతన బాడీ కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగిందని అన్నారు. కమిటీలో మొత్తం 17 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనారని అందులో చైర్మన్ గా డా.గోవింద రెడ్డి, వైస్ చైర్మన్ గా డా.మహేంద్ర కుమార్, ట్రెజరర్ గా రఘునాథ్ రెడ్డి ఉన్నారని అన్నారు. జిల్లా పంచాయతీ అధికారి మాట్లాడుతూ రెడ్ క్రాస్ సొసైటీ లో ఉన్న ప్రతి ఒక్కరు మానవ దృక్పథంతో చాలా మంచి సేవలు అందిస్తున్నారని అన్నారు. రక్త దానం ద్వారా కూడ చాలా మంది ప్రాణాలను కాపాడుతున్నారని అన్నారు. కుట్టు శిక్షణ కేంద్రాలను కూడ ఏర్పాటు చేశారని అన్నారు. బ్లడ్ గ్రూప్ టెస్టింగ్ క్యాంప్స్ కూడ నిర్వహించారని అన్నారు. అవగాహన సదస్సులు కూడ ఏర్పాటు చేసి ప్రజలలో చైతన్యం తీసుకొని వస్తున్నారని అన్నారు. కార్యక్రమం అనంతరం ఎన్నికైన వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆబ్జర్వర్ వెంకటేశ్వర రెడ్డి, ప్రకాశం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ప్రకాష్ బాబు, నంద్యాల ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.