NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కాఫీలు తాగి, ఫోటోలు దిగితే ప్ర‌ధాని కాలేరు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: బీహార్ ముఖ్య‌మంత్రి నితీశ్ కుమార్‌పై ఆ రాష్ట్ర నాయ‌కుడు, ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప్రధాన మంత్రి రేసులో నిల‌వాల‌ని ఆశిస్తున్న నితీశ్‌పై విమ‌ర్శ‌లు చేశారు. కొందరు నేతలతో కాఫీలు తాగడం, ఫొటోలు దిగడం చేసినంత మాత్రాన బ‌ల‌మైన ప్రతిపక్షాన్ని నిర్మించ‌లేర‌ని ఎద్దేవా చేశారు. ఈ విష‌యంలో ప్ర‌జ‌ల‌కు స్ప‌ష్ట‌మైన సందేశం ఇచ్చి, కార్య‌క్షేత్రంలోకి దూకాల‌న్నారు. బీజేపీని ఓడించగల ఊపును తీసుకురావ‌డానికి స‌రైన ప్ర‌చారం చేపట్టాలంటే విస్తృత యంత్రాంగం అవసరం అన్నారు. నితీశ్ పాల‌న‌లో బీహార్‌లో పాల‌న గాడి త‌ప్పింద‌న్నారు. నితీశ్ విన‌డం మానేశార‌ని, రాష్ట్రంలో ఆయ‌న ఎవ్వ‌రినీ లెక్క‌చేయ‌డం లేద‌ని విమ‌ర్శించారు.

                                                    

About Author