NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పత్తికొండ వ్యవసాయ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గా నియామకం

1 min read

ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపిన బిజెపి శ్రేణులు

పత్తికొండ, న్యూస్​ నేడు : పత్తికొండ వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ డైరెక్టర్ గా పత్తికొండకు చెందిన బి. గోవర్ధన్ నాయుడు నియామకం పొందారు.  బిజెపి అసెంబ్లీ కో కన్వీనర్ గా పనిచేస్తున్న గోవర్ధన్ కు మార్కెట్ యార్డ్ నూతన పాలకవర్గ కమిటీలో చోటు లభించింది.  గత కొన్నేళ్లుగా బిజెపిలో క్రియాశీలక నేతగా ఉంటూ చురుకైన పాత్ర పోషిస్తున్నారు. తనకు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గా అవకాశం కల్పించిన పత్తికొండ ఎమ్మెల్యే కేయి శ్యామ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలుపుతూ ధన్యవాదాలు తెలిపారు. తనపై ఎంతో నమ్మకంతో పదవి ఇచ్చినందుకు బాధ్యతాయుతమైన సేవలందిస్తానని ఆయన పేర్కొన్నారు. పత్తికొండ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ అడుగుజాడల్లో నడుస్తూ అభివృద్ధికి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ అందజేస్తామని ఆయన అన్నారు. బిజెపి నాయకుడికి గుర్తింపు నిచ్చి డైరెక్టర్ గా స్థానం కల్పించడం పట్ల పలువురు బిజెపి నేతలు హర్షం వ్యక్తం చేశారు.

About Author