కనులు పండుగగా దేవీ నవరాత్రోత్సవాలు
1 min read
అంగరంగ వైభవంగా దసరా మహోత్సవాలు..
పల్లెవెలుగు, వెబ్ శ్రీశైలం : దసరా మహోత్సవాల్లో నవదుర్గలలో ఏడవ రూపమైన శ్రీభ్రమరాంబ అమ్మవారికి కాలరాత్రి అలంకరణలు చేశారు. స్వామి, అమ్మవారికి గజ వాహన సేవ నిర్వహించారు. కాళరాత్రి పూజ, మంత్రపుష్పము, అమ్మవారి , సువాసినీ పూజలు చేశారు. బాలికల చేత కుమారీ పూజలను నిర్వహించారు. సాయంత్రం అమ్మవారి ఉత్సవ మూర్తికి కాలరాత్రి అలంకరణ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి అమ్మవాలను గజ వాహనంపై ఆసీనులు చేయించి పూజలు నిర్వహించారు భక్తులు స్వామి అమ్మవార్లకు భక్తులు నారీకేళాలు, కర్పూర హారతులతో నీరాజనాలు భక్తులు పలికారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో లవన్న దంపతులు, మరియు ట్రస్ట్ బోర్డు చైర్మన్ దంపతులు ఉభయ దేవాలయాల ఆలయ అర్చకులు వేద పండితులు ఆలయ ఎఇఓలు, అధికారులు,.భక్తులు పాల్గొన్నారు.
