PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అక్రమ బదిలీలు చేస్తూ అధికారులు.. వేధింపులు గురి చేస్తున్నారు

1 min read

– ఏపీ ఎలక్ట్రికల్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్ష,కార్యదర్శులు
పల్లెవెలుగు, వెబ్ ఏలూరు: కార్మికులను అక్రమ బదిలీలు చేయడమే కాకుండా డివిజన్ యాజమాన్యం వేధింపులకు గుర్తు చేస్తుందని ఏపీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (1104) డివిజన్ అధ్యక్ష,కార్యదర్శులు కె కృష్ణ కుమార్,ఎస్ నరసింహారావు, జిల్లా రీజనల్ సెక్రటరీ ఎం రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ బదిలీలు నిలిపివేయాలని,కార్మికులను వేధిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఏలూరు విద్యుత్ భవనం వద్ద ఏపీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేశారు.ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ నార్త్ సెక్షన్లో ఒక అసిస్టెంట్ లైన్మెన్ ను 2021 లో సాధారణ బదిలీలో భాగంగా టౌన్ నుంచి ట్రాన్స్ఫర్ చేశారని చెప్పారు. ఆరు నెలలు గడవక ముందే అదే వ్యక్తిని మళ్లీ యధాస్థానానికి బదిలీ చేశారని,ఏడాది ఆగస్టు నెలలో టౌన్ నుంచి దుగ్గిరాలకు బదిలీ చేసి మళ్లీ నార్త్ కు తీసుకువచ్చారని ఆరోపించారు.2022 జూలై ఒకటో తేదీ నుంచి బదిలీలపై బ్యాన్ ఉందని చెప్పారు. బదిలీలపై బ్యాన్ ఉన్నప్పటికీ అధికారులు అక్రమంగా బదిలీలు చేస్తూ కార్మికులను వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.ఇలా ఉండగా టౌన్ లో ఉన్న లైన్మెన్ పై క్రమశిక్షణ చర్యలు పెండింగ్ లో ఉన్నాయని,బదిలీలపై బ్యాన్ కూడా ఉన్నప్పటికీ అతనికి కావలసిన ప్లేస్ కు ట్రాన్స్ఫర్ చేసి అధికారులు నిబంధనలకు తూట్లు పొడిచారని ధ్వజమెత్తారు.మరమ్మతులకు సంబంధించిన మెటీరియల్స్ కూడా ఓ అండ్ ఎం కార్మికులకు ఇవ్వడం లేదన్నారు.సంబంధం లేని పనులు అప్పగిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.50 సంవత్సరాల క్రితం నిర్మించిన లైనులను కూడా పునరుద్ధరణ చేయకపోవడం వల్ల కండక్టర్లు దిగిపోయి ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ కార్మికులను బాధ్యులను చేస్తున్నారని ధ్వజమెత్తారు.అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా సబ్ స్టేషన్లలో బ్రేకర్స్ పనిచేయడం లేదన్నారు.అక్రమ బదిలీలను వెంటనే నిలుపుదల చేయాలని,కార్మికులపై వేధింపులు ఆపాలని, మేనేజ్మెంట్ మొండి వైఖరి విడనాడాలని డిమాండ్ చేశారు.లేకుంటే ఆందోళన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో యూనియన్ డివిజనల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎం గాంధీ,వర్కింగ్ ప్రెసిడెంట్ మురళీమోహన్ తదితర నాయకులతో పాటు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About Author