ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేద్దాం…
1 min read– వైద్య పరికరాలు అందజేయడం అభినందనీయం : వైద్యాధికారి డాక్టర్ రాయుడు
పల్లెవెలుగు ,వెబ్ నందికొట్కూర: ప్రభుత్వ వైద్యశాలకు మాజీ ఎమ్మెల్యే ఐజయ్య తనయుడు వైసీపీ నాయకులు వై. చంద్రమౌళి వైద్య పరికరాలు అందజేయడం అభినందనీయమని, వైద్యశాల సిబ్బంది తరపున వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని నందికొట్కూరు ప్రభుత్వ వైద్యశాల వైద్యాధికారి డాక్టర్ రాయుడు తెలిపారు. గురువారంరాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు, రాష్ట్ర శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆదేశాల మేరకుమున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి సూచనలతో వైసిపి యువ నాయకులు ఎక్కలదేవి చంద్రమౌళి ప్రభుత్వ వైద్యశాలకు ఆయన సహకారంతో ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రానికి వైద్య పరికరాలు బీపీ టెస్టింగ్ పరికరం, నెబులైజర్లను 12వ వార్డు కౌన్సిలర్ లాలు మోహన్ రవి శంకర్ ప్రసాద్ ఆధ్వర్యంలో డా.రాయుడు కు అందజేశారు. అనంతరం కౌన్సిలర్ లాలూ ప్రసాద్ మాట్లాడుతూ ఎంతో మంది రోగులకు వైద్య పరికరాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వచ్చే రోగులకు వైద్యశాలలో వుండే పరికరాలు సరిపోవడం లేదని వైద్యశాలకు ఉపయయోగపడే పరికరాలు అందించడం గర్వించదగ్గ విషయం అన్నారు. ఎప్పుడు వైద్యశాలకు ఏ అవసరం వచ్చిన బైరెడ్డి సిద్దార్థ రెడ్డి సహకారం తో ఆయన ఆదేశాల మేరకు చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి కూడాఇలాంటి సేవా కార్యక్రమాలకు ముందుండి చేస్తారని, యువ నాయకులు చంద్రమౌళి కూడా అన్నింటా ముందుండి పేదలకు అండగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కె.చిన్న రాజు వైసిపి నాయకులు మార్కెట్ రాజు, పి.రమేష్ ముస్లిం మైనారిటీ నాయకులు అబూబక్కర్, అబ్దుల్ రెహమాన్, బోయ శేఖర్, బ్రహ్మయ్య, శాలి భాష, జవ్వాజి సుంకన్న గౌడ్ సేవా సమితి అధ్యక్షులు శ్రీకాంత్ గౌడ్, రంగస్వామి తదీతరులు పాల్గొన్నారు.