పార్కింగ్ ప్రదేశాల పరిశీలన…
1 min readపల్లెవెలుగు, వెబ్ కర్నూలు: శ్రీశైలం మహా క్షేత్రంలో కార్తీక మహోత్సవాలలో ట్రాఫిక్ అంతరాయం కలకుండా పలు ప్రదేశాలను ఈవో లవన్న ఇంజనీరింగ్ ఆలయ విభాగాల సిబ్బంది క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు పరిశీలనలోట్రాఫిక్ క్రమబద్ధీకరణ టోల్ గేట్ ప్రాంతాన్ని పరిశీలించారు.పార్కింగ్ ప్రదేశాలలో జంగిల్ క్లియరెన్స్ పిచ్చిమొక్కలను తొలగించడం పనులను వెంటనే ప్రారంభించాలన్నారుఅన్ని పార్కింగ్ ప్రదేశాలలో విద్యుత్ దీపాలు ఉండేవిధంగా చర్యలు చేపట్టాలనిఅదేవిధంగా పార్కింగ్ ప్రదేశాలు, వాటి పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉండేందుకుగాను అవసరమైన అన్ని చర్యలను చేపట్టాలని పారిశుద్ధ్య విభాగాన్ని సూచించారు. ఆయా పార్కింగ్ ప్రదేశాలకు చేరుకోవలసిన దారులు మరియుపార్కింగ్ స్థలాలు స్పష్టంగా తెలిసేవిధంగా సూచిక బోర్డులు ఏర్పాటు చెయ్యనున్నారు యజ్ఞవాటిక సమీపంలో టూరిస్ట్ బస్సుల పార్కింగుకు ఏర్పాటుయజ్ఞవాటిక వద్ద ఎదురుగాఆర్టిసి బస్టాండ్ వెనుకభాగం, హైస్కూల్ ఎడమవైపు భాగం, ఘంటామఠం వెనుకభాగం, ఆగమపాఠశాల ఎదురుగా గల ఆరుబయలు ప్రదేశం. మొదలైన చోట్ల కారు పార్కింగునకు ఏర్పాట్లను చేయడం జరుగుతోంది.రద్దీ రోజులలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా తగు ముందస్తు ప్రణాళికలను తీసుకోవాలని ఆలయ సి ఎస్ ఓ కి సూచించారు. స్థానిక పోలీసు అధికారుల సహకారంతో ట్రాఫిక్ సమస్యలు కలగకుండా తగు చర్యలు చేపట్టాలన్నారు. వాహనదారులు అధికసమయం వేచివుండకుండా త్వరితగతిన టోల్ రుసుమునుచెల్లింపు చేసేందుకు తగు చర్యలు చేపట్టాలని వసతివిభాగాన్ని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆలయ విభాగాల సిబ్బంది ఇంజనీరింగ్ సిబ్బంది ఈవో లవన్న పాల్గొన్నారు.