బంగాళాఖాతంలో అల్పపీడనం.. రేపు తుఫానుగా మారే అవకాశం
1 min readపల్లెవెలుగువెబ్ : బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం రేపటికి బలపడి అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. అనంతరం ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణిస్తూ 22న ఉదయానికి వాయుగుండంగా మారుతుందని, ఆ తర్వాత మరింతగా బలపడి తుపానుగా రూపాంతరం చెందుతుందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.