క్లీన్ ఇండియా క్యాంపెయిన్ 2.0 ..ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ
1 min readపల్లెవెలుగు , వెబ్ బనగానపల్లె: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన ఎన్ఎస్ఎస్ విద్యార్థులు బుధవారం ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి గ్రామపంచాయతీ ఈవోకు అందజేశారు.క్లీన్ ఇండియా క్యాంపెయిన్ 2.0 కార్యక్రమంలో భాగంగా ఎన్ఎస్ఎస్ అధికారిణి కౌసల్యాదేవి ఆధ్వర్యంలో విద్యార్థులు వారి కళాశాల ఆవరణం,పెట్రోల్ బంక్ సెంటర్,బహిరంగ ప్రదేశాలలో వృధాగా పడవేసిన ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించారు. వాటిని సంచుల్లో వేసి గ్రామపంచాయతీ అధికారులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ అధికారిణి కౌసల్యాదేవి మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకాన్ని ప్రజలు తగ్గించాలని ప్రకృతి సిద్ధంగా లభించే పదార్థాలతో సంచులు,బుట్టలను మొదలు వాటిని తయారు చేసి ఉపయోగించుకోవాలని సూచించారు.పర్యావరణ హితాన్ని ప్రోత్సహించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ విద్యార్థులు, కళాశాల అధ్యాపకులు జీవి నారాయణ,మహేశ్వర్ రెడ్డి, వహీదా తదితరులు పాల్గొన్నారు.