కో ఆప్షన్ నెంబర్ నీతా కుమార్ జైన్.. అన్నదానం
1 min read– నగరంలో నానాటికి విస్తరిస్తున్న ఆమె సేవలు
పల్లెవెలుగు, వెబ్ ఏలూరు : దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు నీత కుమార్ జైన్ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) అనాధ నిరాశ్రయుల వసతి గృహంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు,నీతా కుమార్ జైన్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పని చేస్తూ తనకున్న దానిలో అనేక సంఘ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక కతను సంతరించుకున్నారు,నగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిచ్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టడంలో నీత కుమార్ జైన్ ఒకరిని చెప్పుకోవచ్చు.విజయదశమిని పురస్కరించుకొని నీతా కుమార్ జైన్, జైన్ మందిరంలో అనేక కార్యక్రమాల నిర్వహించి అనేక మందికి సేవా కార్యక్రమాలు నిర్వహించారు,ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పంతో పర్యావరణ పరిరక్షణే మన ధ్యేయం కార్యక్రమంలో వన్ టౌన్ వైభవ్ పోర్టు ప్రాంతంలో చెత్తాచెదారంతో ఆ ప్రాంతం అంతా దుర్గం వెదజల్లుతున్న తరుణంలో చక్కని పూల మొక్కలను,ఆహ్లాదాన్నిచ్చే చెట్లను నాటి ఆ ప్రదేశాన్ని పశువులు ఇతర జంతువులు ప్రవేశించకుండా గ్రిల్ ఏర్పాటు చేయించి ఆ ప్రదేశాన్ని మినీ పార్కుల.సుందరవనంల తీర్చిదిద్దారు,కెనాల్ రోడ్డు ప్రాంతాల్లో చెత్తను తొలగించిన సమయంలో కృష్ణ కాలువకి ఇరువైపులా పచ్చని చెట్లు నాటి ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు నీతా కుమార్ జైన్.నాడు నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు,మున్సిపల్ కమిషనర్,నగరంలోని వైసిపి కార్పొరేటర్లు,నాయకులు సిబ్బంది ఆమెను అభినందనలతో ముంతెచ్చారు,ఆమె మరిన్ని సేవా కార్యక్రమాలు పదిమందికి అందించాలని పలువురు కోరుకుంటున్నారు.