PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దొంగతనానికి పాల్పడిన వ్యక్తులు అరెస్టు..

1 min read

పల్లెవెలుగు, వెబ్​ బనగానపల్లె: నియోజకవర్గం లో కోయిలకుంట్ల పట్టణం 25.10.2022 వ తేదీన నందు శ్రీ లక్ష్మి వేంకటేశ్వర ట్రేడర్స్ నందు రాత్రి సుమారు 11:30 గంటల సమయములో ఐరన్ షాప్ లోనికి వెళ్ళి ట్రాక్టర్ పెట్టుకొని సదరు షాప్ నందు ఇనుప యాంగ్లర్లు మరియు ఇనుప పాట్లు దొంగతనము చేస్తుండగా సదరు షాపు యజమాని అయిన ఐరన్ వెంకటేశ్వర్లు చూసి కేకలు వేయగా దుండగులు అక్కడి నుండి పారిపోయారు. సదరు దొంగతనము అయిన వస్తువుల విలువ సుమారు 4,55,000/-. ఉంటుందని ఈ విషయములో ఐరన్ షాప్ యజమాని వెంకటేశ్వర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోయిలకుంట్ల పోలీసు స్టేషన్ నందు 26.10.2022 తేదీన సెక్షన్ 457, 382 IPC క్రింద కేసు నమోదు చేయడము జరిగింది. ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా కోయిలకుంట్ల టౌన్ కి చెందిన షేక్ చాంద్ బాష అను వ్యక్తిని గుర్తించడము జరిగింది. ఇతను కోవెలకుంట్ల టౌన్ లోని అవుకు రోడ్డు నందు వెల్డింగ్ షాప్ నిర్వహిస్తూ చెడు వ్యసనాలకు బానిసై మరో ఏడు మండి స్నేహితులతో కలిసి ఈ నేరమును చేయడము జరిగింది. కేసు దర్యాప్తులో భాగంగా ఈరోజు మధ్యాహ్నము కోవెలకుంట్ల మండలము కంపమల్ల మెట్ట వద్ద ఆరు మంది ముద్దాయులను అరెస్టు చేసి వారి వద్ద నుండి దొంగలించబడిన 30 ప్లాటులు [100X 16, 50 X 14] మరియు 150 యాంగ్లర్ల ను, ఒక ట్రాక్టర్ మరియు ట్రాలి, ఒక బజాజ్ అవెంజర్ బైక్ నెంబర్ AP 21 BE 1135 మరియు ఒక బజాజ్ పల్సర్ బైక్ నెంబర్ AP 39 MH 8762 లను స్వాధీనములోనికి తీసుకోవడమైనది.ఈ కేసులో ఇంకా ఇద్దరు ముద్దాయులను అరెస్టు చేయవలసి ఉంది. అరెస్టు కాబడిన మూద్దాయిల వివరాలు షేక్ చాంద్ భాషా, వయస్సు 29 సం,,లు, తండ్రి : షేక్ ఫక్రుద్దీన్ దస్తగిరి, గడ్డ వీధి, కోవెలకుంట్ల టౌన్ మండలము. పెంజ జయ క్రిష్ణ, వయస్సు: 26 సం,, తండ్రి: రఘురామ పుల్లయ్య, గడ్డ వీధి, కోవెలకుంట్ల టౌన్ & మండలము..షేక్ రసూల్, వయస్సు: 21 సం,, తండ్రి: జాఫర్, ఇందిరమ్మ కాలని, కోవెలకుంట్ల టౌన్ & మండలము.షేక్ అబ్దుల్ అజీస్, వయస్సు 21 సం లు:, తండ్రి: షేక్ నబీ సాబ్, సాయి నగర్, కోవెలకుంట్ల టౌన్ మరియు మండలము.కట్టుబడి మహమ్మద్ రఫీ, వయస్సు: 21 సం,, తండ్రి: మౌలాలి, రంగరాజు పేట, కోవెలకుంట్ల టౌన్ & మండలము. షేక్ షాషవలి, వయస్సు: 21 సం,, తండ్రి: ఇబ్రహీం, చైతన్య స్కూల్ వెనుక వైపు, బనగానపల్లి టౌన్ & మండలము.ఇంకా అరెస్టు కావలసిన ముద్దాయులు షేక్ హుస్సైన్ బాష, తండ్రి: మాబుస, సంతపేట, కోవెలకుంట్ల టౌన్ మరియు మండలము.దూదేకుల నల్లబోతుల హుస్సైన్, తండ్రి: తిరుపాలు, ఈద్గా నగర్, బంగానపల్లి టౌన్ మరియు మండలము. అరెస్టు కాబడిన ముద్దాయులను గౌరవ కోవెలకుంట్ల కోర్ట్ నందు హాజరు పరుచగా, కోర్ట్ వారు వారికి రిమాండ్ విదించడముతో వారిని ఆళ్లగడ్డ సబ్ జైల్ కు తరలించడము మైనది.

About Author