శ్రీశైలం క్షేత్రంలో కార్తిక సందడి
1 min readపల్లెవెలుగు, వెబ్ శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలో కార్తీక శోభ సంతరించుకుంది ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి శ్రీశైలం తరలి వస్తున్నారు వేకువ జామున నుండి పుణ్య నది స్థానాలు ఆచరించి కృష్ణమ్మ తల్లికి దీప దానాలు చేసి భక్తులు శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి వార్ల దర్శించుకున్నారు భక్తులు దర్శనానికి నాలుగు గంటల సమయం పడటంతో క్యూకాంప్లెక్స్ వేచివుండే భక్తులకు నిరంతరం అల్పాహారం, బిస్కెట్లు, మంచినీరు మరియు వేడిపాలు భక్తులకు అంద చేస్తున్నారు. భక్తులు రద్దీ అధికంగా ఉండటంతో ఆలయ అధికారులు భక్తులకు అలంకార దర్శనం ఏర్పాటు చేశారు. కార్తీక మాసం పురస్కరించుకొని గంగాధర మండపం వద్ద మరియు శివాజీ గోపురం వద్ద ఉన్న శివ మాడవీధిలో భక్తులు అధిక సంఖ్యలో దీపారాధన చేసుకున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈవో లవన్న ఆలయ సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించారు ప్రసాదాలను భక్తులు అవసరమైన లడ్డు ప్రసాదాలను భక్తులకు అందుబాటులో ఉంచారు.