ఓసిటీ ని ప్రారంభించిన మంత్రి జోగి రమేష్
1 min readపల్లెవెలుగు, వెబ్ విజయవాడ: విజయవాడ ఆంధ్ర హార్ట్ అండ్ బ్రెయిన్ హాస్పిటల్ లో అత్యాధునిక ఓ సి టి (ఆప్టికల్ కరోనరీ టోమోగ్రఫీ) యాంజియోగ్రామ్ మిషన్ మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే విష్ణు లు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ ఆంధ్ర హాస్పిటల్ లో నిష్ణాతులైన డాక్టర్స్ చే మంచి వైద్యం అందుతుందని ప్రజల్లో నమ్మకం ఉందన్నారు. విజయవాడలోనే మొట్టమొదటిసారిగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానం గల ఈ ఓ సి టి మిషిన్ ఆంధ్ర హాస్పిటల్ లో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.పేదలకు ఈ అత్యాధునిక వైద్య సదుపాయం అందించేందుకు ముఖ్యమంత్రి జగన్ తో చర్చించి ఆరోగ్యశ్రీలో ఈ వైద్య సదుపాయం కల్పించడానికి తమ వంతు కృషిచేస్తానన్నారు. ఎం ఎల్ ఏ మల్లాది విష్ణు మాట్లాడుతూ గుండె జబ్బులకు సంబంధించి ఇటువంటి ఆత్యాధునిక యంత్రం విజయవాడ ప్రజలకు అందుబాటులో తెచ్చిన ఆంధ్ర హార్ట్ అండ్ బ్రెయిన్ హాస్పిటల్ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. అనంతరం హాస్పిటల్ చీప్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీమన్నారాయణ మాట్లాడుతూ గుండెకు సంబంధించి ఇబ్బంది ఏమైనా కలిగినప్పుడు ఓ సి టి తో పరీక్ష చేస్తే స్టంట్ లు అవసరమా లేదా అనేది కచ్చితంగా నిర్ధారించుకోవచ్చని,యాంజియో ప్లాస్టి, గుండె నరాలలో కాల్షియం ఎక్కువై ఏర్పడిన బ్లాక్స్ ను స్పష్టంగా ఈ మిషన్ లో తెలుస్తుందన్నారు .ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీమన్నారాయణ, బెల్జియం నుండి విచ్చేసిన డాక్టర్ ఎల్విన్ కేది, పాల్గోన్నారు.