కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఆపస్ వినతి
1 min readపల్లెవెలుగు,వెబ్ విజయవాడ: ఆంధ్ర,తెలంగాణరాష్ట్రాల్లో ఉపాధ్యాయులు సర్వీస్ రూల్స్ లేక ప్రమోషన్లకు నోచుకోవడం లేదని, ఏకీకృత సర్వీస్ రూల్స్ కోసం రాష్ట్ర పతి గెజిట్ వచ్చినా కోర్టు కేసుల వల్ల అమలు కాలేదని ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలుకు కృషి చేయాలని, సిపీయస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ అమలు, ప్రాథమిక విద్య మాతృ భాషలోనే ఉండాలని, టీచర్లకు బోధనేతర పనులు అప్పగించరాదని, ఉపాధ్యాయులకు ఆదాయ పన్ను మినహాయించాలని తదితర సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖా మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారిని నెల్లూరు నందు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యస్ బాలాజీ ఆధ్వర్యంలో అపస్ ప్రతినిధులు కలసి వినతి పత్రం అందచేసారు. మార్చి 5 న నెల్లూరు లో జరిగే రాష్ట్ర మహాసభలకు ముఖ్య అతిథిగా విచ్చేసి మార్గ దర్శనం చేయాలని కోరారు . ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా అధ్యక్షులు కె. రాజగోపాలాచార్యులు, ప్రధాన కార్యదర్శి యస్ . చంద్రమౌళి, కోశాధికారి యస్ .బాలాజీ తదితరులు పాల్గొన్నారు.