వీధులకు అధికారుల నిర్లక్ష్యం : బీజేపీ నాయకులు
1 min readపల్లెవెలుగు, వెబ్ బనగానపల్లె: మండల కేంద్రం లోని మైనర్ ఇరిగేషన్ అధికారులు వీధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు బనగానపల్లి బిజెపి మండల అద్యక్షులు బచ్చు శరత్ చంద్ర కుమార్ అధ్వర్యంలో మండలంలో నీ కుక్కల గంటి చెరువు కు ఏర్పడిన ప్రమాదం పై అధికాులకు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్ళారు ఈ సంద్భంగా బిజెపి ఓ బి సి మోర్చ జిల్లా అధ్యక్షుడు శివకృష్ణ యాదవ్ మాట్లాడుతూ కుక్కల గంటి చెరువు పై వినతిపత్రం ఇచ్చేందుకు మైనర్ ఇరిగేషన్ శాఖ కార్యాలానికి వెళ్లగా కార్యాలయం లో అధికారులు గానీ క్లర్క్ గానీ సంభందిత వాచ్మెన్ గానీ ఎవ్వరూ లేరు ఒక ప్రవేటు ఉద్యోగిని విచారించగా అధికారులు రెండు రోజులకొక సారి మూడు రోజుల కొక సారి వస్తుంటారు ఎవరు రారు అని వివరణ ఇచ్చారు అని అన్నారు అలాగే మైనర్ ఇరిగేషన్ అధికారులు ఇంత నిర్లక్షయంతోనే చెరువు కట్టలు పంట కాలువలు శిధిలావస్థలో ఉన్న పరిస్తితి ఏర్పడింది అని అన్నారు శరత్ చంద్ర కుమార్ మాట్లాడుతూ మైనర్ ఇరిగేషన్ అధికారులు పూర్తి నిర్లక్ష్యం చేయడం వల్ల చెరువుకు ప్రమాద స్థాయికి చేరిందని వారన్నారు ఇప్పటికైనా మైనర్ ఇరిగేషన్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన చెరువు కట్టకు మరమ్మతులు చేసి ప్రమాదాన్ని అడ్డుకోవాలని వారు అన్నారు బిజెపి జిల్లా కార్యదర్శి యాదగిరి మాట్లాడుతూ గండిపడి నీరు వృధాగా పోతుందని ఈ నీరు ఇలాగే లీకేజ్ అవుతే కట్ట తెగిపోయే ప్రమాదం ఉన్నదని జరగరాని దీ జరిగితే జోలపురం గ్రామం మరియు చెరువు కింద ఉన్నటువంటి భూభాగం పూర్తిగా కొట్టుకపోయే ప్రమాదం ఉంది కనుక జిల్లా అధికారులు తక్షణమే స్పందించి పొంచిఉన్న ప్రమాదాన్ని అడ్డుకోవాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు శివరామిరెడ్డి బిజెపి మండల ప్రధాన కార్యదర్శి సురేష్ యాదవ్ మండల ఉపాధ్యక్షులు బాల వెంకటేశ్వర్లు ఓబీసీ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.