ఆయుష్మాన్ భారత్ నమోదు చేయాలి : ఎంపీడీఓ
1 min readపల్లెవెలుగు, వెబ్ మిడుతూరు : ప్రజలు ఇంటి దగ్గర ఉన్న ఉదయం సాయంత్రం వారి ఇంటి దగ్గరికి వెళ్లి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకం కింద ప్రతి కుటుంబ వివరాలను నమోదు చేయాలని ఎంపీడీఓ జీఎన్ఎస్ రెడ్డి మరియు ఈఓఆర్డి ఫక్రుద్దీన్ అన్నారు.స్థానిక మండల కేంద్రంలో ఉన్న సచివాలయ సిబ్బందితో ఆరోగ్య ఆయుష్మాన్ భారత్ పథకం ఎంతమందికి చేశారని సిబ్బందిని అడిగారు.సచివాలయంలో పనిచేస్తున్న ఒక్కో సిబ్బందికి ఒక్కొక్కరికి కొందరు వాలంటీర్లను బాధ్యతలు అప్పగించామని ఆసిబ్బంది వాలంటీరు ఏఎన్ఎం ఆరోగ్య కార్యకర్తలు కలిసి వారి ఇంటికి వెళ్లి కుటుంబ వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శులు సుధీర్ నందకుమార్,కేశావతిలు తెలిపారు.వీటిలో మీరందరూ బాగా కలుపుకొని బాగా ముందుకు వెళ్తున్నారని వారిని ఎంపీడీవో,ఈవోఆర్డీ అభినందించారు.పగలు పూట ప్రజలు పనులకు వెళ్తారని అంతేకాకుండా పగలు సర్వర్ సరిగ్గా పని చేయనందున సాయంత్రం ఉదయాన్నే ప్రజలు ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి వాలంటీర్లు ఆరోగ్య సిబ్బంది ఇంటికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసే విధంగా చూడాలని అన్ని సచివాలయ సిబ్బంది చూడాలని వారు తెలియజేశారు.ఈరిజిస్ట్రేషన్లను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు.ఈకార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు సుధీర్ నందకుమార్,కేశావతి,గ్రామ సర్వేయర్ సుబ్బారెడ్డి,వెల్ఫేర్ అసిస్టెంట్ దాసరి మధు,మహిళా పోలీస్ కుర్షీదాబాను పాల్గొన్నారు.