PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బొంగు చికెన్ వండిన రాహుల్ గాంధీ

1 min read

పల్లెవెలుగువెబ్ : తెలుగు రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాల్లో తయారయ్యే బొంగు చికెన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెదురు బొంగులో చికెన్ వండే విధానం, దాని రుచి గురించి తెలుగు జనం కథలు కథలుగా చెప్పుకుంటారు. అలాంటి బొంగు చికెన్ ను కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలతో కలిసి వండారు. వంట వరకే పరిమితం కాని రాహుల్… పార్టీకి చెందిన తెలంగాణ నేతలు, గిరిజనులతో కలిసి బొంగు చికెన్ రుచి చూశారు. తాను వండిన బొంగు చికెన్ ను తానే అందరికీ వడ్డించి మరీ ఆయన తన ముచ్చట తీర్చుకున్నారు. ఈ అరుదైన ఘటనకు చెందిన వీడియోను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ (టీపీసీసీ) శనివారం సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది.

About Author