మోదీకి 12 పార్టీల లేఖలు..!
1 min readపల్లెవెలుగు వెబ్: ప్రధాని మోదీకి దేశంలోని 12 ప్రతిపక్ష పార్టీల నేతలు లేఖ రాశారు. దేశ వ్యాప్తంగా ఉచిత వ్యాక్సినేషన్ చేపట్టాలని డిమాండ్ చేశారు. సెంట్రల్ విస్టా భవన నిర్మాణం ఆపాలని, ప్రజా వైద్యం కోసం నిధులు ఖర్చు చేయాలని కోరారు. దేశ విదేశాల నుంచి ప్రభుత్వమే టీకాలను సేకరించాలని కోరారు. కంపల్సరీ లైసెన్స్ నిబంధనలు అమలుచేసి దేశీయంగా వ్యాక్సిన్ ఉత్పత్తి పెంచాలని సూచించారు. బడ్జెట్ లో కేటాయించిన రూ.35వేల కోట్లు ఖర్చు చేయాలని కోరారు. లెక్కాపత్రం లేని పీఎం కేర్స్ డబ్బును వ్యాక్సిన్ కొనుగోలుకు, ఆక్సిజన్ కొనుగోలుకు, వైద్య సదుపాయాల కల్పనకు ఖర్చు చేయాలని కోరారు. నిరుద్యోగులకు నెలకు 6 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గోదాముల్లో ఉన్న ధాన్యాన్ని పేదలకు పంచాలని కోరారు. ఈ లేఖ మీద సోనియ గాంధీ , మమత బెనర్జీ, స్టాలిన్, శరద్ పవార్, హేమంత్ సోరెన్, ఫరూక్ అబ్దుల్లా, అఖిలేశ్ యాదవ్, తేజస్వీ యాదవ్, సీతారాం ఏచూరి, డి. రాజా తదితరులు సంతకాలు చేశారు.