సొంత నిధులతో.. స్మశానానికి దారి ఏర్పాటు..
1 min readపల్లెవెలుగు వెబ్: చెన్నూరు హైవే వంతెన, పెన్నా నది ప్రక్కనగల స్మశాన వాటికలో పిచ్చి మొక్కలు, కంప చెట్లు ఏపుగా పెరిగి, స్మశానానికి, దహన, అలాగే శవపూడి కలకు వెళ్లేందుకు వీలు లేకుండా పోవడంతో, బుధవారం స్థానికులు లక్ష్మీ నగర్ కు చెందిన రెడ్డి చర్ల సుబ్బరాజు, లోమడ వెంకటసుబ్బారెడ్డి, ఆటో బాబులు స్పందించి, వారి సొంత నిధులతో జెసిబి యంత్రం ద్వారా అక్కడి పిచ్చి మొక్కలు, కంప చెట్లను తొలగించి దారి కూడా ఏర్పాటు చేయడం జరిగిందని వారు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు బుధ వారం చెన్నూరులో విలేకరులతో మాట్లాడుతూ, చెన్నూరు లోని లక్ష్మీ నగర్, సరస్వతి నగర్, రాజుల కాలనీ, అదేవిధంగా కొత్త గాంధీనగర్, అరుంధతి నగర్, బెస్త కాలనీ బుడ్డాయపల్లి, సుగాలి కాలనీ తదితర ప్రాంతాలకు సంబంధించిన వారు ఎవరైనా మరణిస్తే వారి దహన, శవపూడికలకు సంబంధించి, అక్కడి స్మశానం పూర్తిగా పిచ్చి మొక్కలు, కంపచెట్లతో పూర్తిగా నిండిపోవడంతో అక్కడి ప్రజలు పూర్తిస్థాయిలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఈ విషయమై అనేకమార్లు స్థానిక ప్రజా ప్రతినిధులకు, అదేవిధంగా అధికారులకు తెలియ చేసినప్పటికీ, ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదని తెలిపారు, దీంతో తామే సొంతంగా నిధులు ఏర్పాటు చేసుకొని, అక్కడ జెసిపి యంత్రంతో పిచ్చి మొక్కలు, కంప చెట్లను తొలగించడం జరిగిందన్నారు, అంతే కాకుండా స్మశానానికి సంబంధించిన దారి లో చిన్న చిన్న మరమ్మత్తులు చేపట్టడం జరిగింది అన్నారు, ఇదంతా కూడా ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని వారు తెలియజేశారు.