PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వేగానికి కళ్లెం వేసేది ఎవరు..

1 min read

– రెచ్చిపోతున్న యువత
పల్లెవెలుగు వెబ్​ గడివేముల: నేటి యువత రేపటి భవిష్యత్తుకు బంగారు బాట అనే సామెత తెలుగులో చాలామందికి చిరపరిచితం కానీ నేటి యువత విచ్చలవిడిగా ద్విచక్ర వాహనాలను అధిక వేగంతో నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతున్నారు గడివేముల గ్రామంలో మంగళవారం నాడు అతివేగంతో ద్విచక్ర వాహనం మీద వస్తూ ఢీకొట్టడంతో తాసిల్దార్ ఆఫీస్ వాచ్మెన్ కు కాలు విరగడం తెలిసిందే తల్లితండ్రుల పర్యవేక్షణలోపమో అధికారుల నిర్లక్ష్యమో రహదారిపై వెళ్లే పాదాచారులకు ప్రజలకు ప్రమాదాలకు గురిచేస్తుంది ఈమధ్య నలుగురు ఒకటే వాహనంపై ముగ్గురు మైనర్లు గ్రామాల్లోని రద్దీప్రాంతాలలో చక్కర్లు కొట్టడం రాత్రి 9:30 వరకు వాహనాలు వేసుకొని అతివేగంతో తిరగడం నిత్య కృత్యం అయిపోయింది పెరుగుతున్న జనాభా దృష్టిలో పెట్టుకొని పోలీస్ శాఖ అధికారులు సరైన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు ఇతర గ్రామాల నుండి మైనర్ యువకులు మండల కేంద్రానికి రాత్రి పొద్దుపోయే వరకు గడపడం కోసం వస్తున్నారని మండల వాసులు ఆరోపిస్తున్నారు గతంలో రాష్ డ్రైవింగ్ వల్ల కొంతమంది గాయాల పాలవడం అధికారులకు తెలిసిన విషయమే… దీనిపై గడివేముల ఎస్సై వెంకటసుబ్బయ్యకు వివరణ కోరగా తల్లితండ్రులు మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇవ్వొద్దని ప్రమాదాలకు కారకులైతే తల్లి తండ్రుల మీద కూడా కేసు పెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు రోజు వాహనాల చెకింగ్ చేపట్టామని మైనర్లు వాహనాలతో పట్టుబడితే కేసు నమోదు చేసి కోర్టుకు పంపిస్తామని హెచ్చరించారు గ్రామాలలో రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

About Author