మహాశివరాత్రి ఏర్పాట్ల పరిశీలన
1 min readపల్లెవెలుగు వెబ్ శ్రీశైలం: ఫిబ్రవరి 11 నుండి 21 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. భక్తుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఉత్సవాలకు వివిధ విస్తృత ఏర్పాట్లు ఆలయ అధికారులతో ఈవో లవన్న పరిశీలనలో భాగంగా లడ్డూ ప్రసాద విక్రయకేంద్రాలు, అన్నప్రసాద వితరణ భవనం, ఆర్జితసేవాకౌంటర్లు, క్యూకాంప్లెక్స్ మొదలైనవాటిని పరిశీలించారు.లడ్డు ప్రసాదాల విక్రయకేంద్రాల పరిశీలించారు అదనపుగా ఎనిమిది లడ్డు కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు దీనితోపాటు దివ్యాంగులకు మరియు వృద్ధులకు వేరువేరుగా కౌంటర్ ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
దర్శనానికి వచ్చే భక్తులు:
క్యూలైన్లలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అత్యవసర సమయాలలో వినియోగించుకునేందుకు క్యూలైన్లలోని అవసరమైన అన్నిచోట్ల కూడా అత్యవసర గేట్లను (ఎమర్జెన్సీ ఎగ్జిట్ గేట్స్) ఏర్పాటు చేయనున్నారు అదేవిధముగా క్యూకాంప్లెక్స్ లోని అన్ని శౌచాలయాలలో శుభ్రత నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరచాలన్నారుక్యూ కాంప్లెక్స్ లోని మంచినీటి కుళాయిలు, వాష్ బేసిన్లు అన్ని కూడా వినియోగానికిఅందుబాటులో వుండే విధముగా చర్యలు చేపట్టలన్నారు. క్యూకాంప్లెక్స్ నందు మొత్తం 16 కంపార్టుమెంట్ల ద్వారా ఉచిత దర్శనానికి. భక్తులకు దర్శనం కల్పించబడుతున్నారు అదేవిధంగా 6 కంపార్టుమెంట్ల ద్వారా భక్తులను శీఘ్రదర్శనానికి రూ. 200/-లటికెటు అనుమతించడం జరుగుతుంది. ఈ పరిశీలనలో ఆలయ ఈవో లవన్న డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు నరసింహారెడ్డి, సహాయ కార్యనిర్వహణాధికారి ఎం. హరిదాసు, పర్యవేక్షకులు అయ్యన్న, దేవిక తదితర సిబ్బంది పాల్గొన్నారు.