ముగ్గుల పోటీలను ప్రారంబించిన ఎమ్మెల్యే
1 min read– కాటసాని రామిరెడ్డి గారు ఆయన సతీమణి కాటసాని జయమ్మ గారు ,కాటసాని ఓబుల్ రెడ్డి గారు ,కాటసాని మేధా శ్రీ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : పట్టణంలో .గ్రామీణవాతావరణాన్ని తలపించిన సంక్రాంతి సెట్టింగ్స్ అందరినీ ఆకట్టుకొన్న కాటసాని రామిరెడ్డి గారి కుటుంబ సభ్యుల కోలాటం..భోగి మంటల కార్యక్రమంలో పాల్గొన్న బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారి కుటుంబ సభ్యులు . పెద్ద సంఖ్యలో పాల్గొన్న బనగానపల్లె పట్టణ ప్రజలు .. సంక్రాంతి ముగ్గుల పోటీల్లో 150 మంది పాల్గొన్న మహిళలు ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రధానం చేసిన కాటసాని జయమ్మ గారు బనగానపల్లె పట్టణం ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణం లోని హై స్కూల్ ఆవరణం లో స్వర్గీయ కాటసాని నాగార్జున రెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్ ఆద్వర్యం లో సంక్రాంతి ముగ్గుల పోటీలను బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆయన సతీమణి కాటసాని జయమ్మ ,కుమారుడు కాటసాని ఓబుల్ రెడ్డి కోడలు కాటసాని మేధా శ్రీ రెడ్డి లు ప్రారంబించారు. ముందుగా గ్రామీణ వాతావరణాన్ని తలపించేటట్లు సంక్రాంతి పండుగ సెట్టింగ్ ను తిలకించారు . ఆ తరువాత భోగీ మంటల కార్యక్రమం లో పాల్గొని ఎమ్మెల్యే కాటసాని కుటుంబ సభ్యులు కోలాటం కార్యక్రమం లో ప్రజలతో పాల్గొన్నారు . అనంతరం కాటసాని జయమ్మ గారు పోటీదారుల ముగ్గులను న్యాయ నిర్ణేతలతో కలిసి పరిశీలించారు . అనంతరం మొదటి బహుమతి డబుల్ డోర్ ఫ్రీజ్ సునంద ,రెండవ బహుమతి సింగిల్ డోర్ ఫ్రీజ్ శారద ,మూడవ బహుమతి టివి లక్ష్మీ శారద ,నాలుగవ బహుమతి వాషింగ్ మెషీన్ సాయి భావన,ఐదవ బహుమతి రైస్ కుక్కర్ హైమావతి లక్కీ డ్రిప్ ద్వారా ఇరవై వేలు విలువ చేసే వాటర్ ప్యూరిఫైర్ ,అలాగే పోటీల్లో పాల్గొన్న 150 మంది మహిళలకు బహుమతులను కాటసాని జయమ్మగారు అందించారు. ఈ కార్యక్రమం లో బనగానపల్లె పట్టణ సర్పంచ్ ఈసారి ఎల్లమ్మ,వార్డ్ మెంబర్ కుమ్మరి సురేష్, డాక్టర్ రవి కుమార్,గాధం శెట్టి వేణుగోపాల్ ,చక్రపాణి ,నూకల విశాలాక్ష్మి ,నూకల వాసంతి ,గుండా సుప్రజా ,రూప ,బండారు లలిత ,స్వర్ణలతా ,ప్రజలు,మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టి పడే విధంగా ఈ సంక్రాంతి పండుగ జరుపుకోవడం అనవాయతిగా వస్తుంది అని చెప్పారు . ముగ్గుల పోటీల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ న్యాయనిర్ణేతలు ఇచ్చిన సమయం లో మంచిగా ముగ్గులు వేయాలని తెలిపారు . ఈ ముగ్గుల పోటీల్లో మాట సామరస్యానికి ప్రతీకగా ప్రజలు పాల్గొనడం జరిగిందని చెప్పారు . ముగ్గుల పోటీల్లో గెలిచిన విజేతలకు డబుల్ డోర్ ఫ్రీజ్ ,సింగల్ డోర్ ఫ్రీజ్ ,టివి ,వాషింగ్ మెషీన్ ,కుక్కర్ తో పాటు ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కూడా ఒక బహుమతి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పారు కాటసానిజయమ్మగారుమాట్లాడుతూముందుగాబనగానపల్లె నియోజకవర్గ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ కూడా ఆర్గనైజర్స్ చెప్పిన విదంగా నియమ నిబందనలు పాటించాలని ప్రతి ఒక్కరూ కూడా తమప్రతిభాను చాటు కోవాలని చెప్పారు. తన పెద్ద కుమారుడు కాటసాని నాగార్జున రెడ్డి జ్ఞాపికార్థం అతని పేరు మీద ఛారిటబుల్ ట్రస్ట్ చేపట్టడం జరిగిందనిఆట్రస్ట్ద్వారాఅనేకసేవకార్యక్రమాలతోపాటుగా,దైవ,సనాతన కార్యక్రమాలను చేపట్టాలని కోరుకొంటున్నాను అందులో భాగంగానే దాదాపుగా కోటి రూపాయలతో ఐదు ఎకరాల స్థలాన్ని కొనడం జరిగిందని లలిత పరమేశ్వరి అమ్మవారి ఆలయ నిర్మాణం త్వరలోనే చేపడుతాను అని చెప్పారు. ప్రజల సహయ, సహకారాలు తమ కాటసాని కుటుంబం కు ఎల్లప్పుడూ అందించాలని అప్పుడే తాము అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడానికి తోడ్పాటు అందించిన వారు అవుతారు అని చెప్పారు . అలాగే ఆంద్ర ప్రదేశ్ కు వైఎస్ జగన్ అన్న ముఖ్య మంత్రి అయిన తరువాత పాదయాత్రలో ఇచ్చిన హామీలను అన్నింటినీ కూడా నెరవేర్చడం జరుగుతుంది అని జగనన్న అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలకు పెద్ద పీట వేయడం జరిగిందని రాజకీయాల్లో కూడా మహిళలకు యాబై శాతం రిజర్వేషన్ కల్పించిన మహిళా పక్షపాతి వైఎస్ జగన్ అన్న అని చెప్పారు . తన భర్త కాటసాని రామిరెడ్డి గారు అనేక అభివృద్ది కార్యక్రమలకు శ్రీకారం చుట్టడం జరిగిందని ప్రజల చల్లని దీవెనలతో అన్నీ కార్యక్రమాలు పూర్తి చేస్తాం అని ఎన్నికలు ఎప్పుడు జరిగిన కూడా తన మీ కుటుంబం లో ఒక అక్కగా ,ఒక చెల్లిగా ,ఒక కూతురుగా ఆశీర్వదించి మళ్ళీ 2024 ఎన్నికల్లో తన భర్త కాటసాని రామిరెడ్డి గారిని అఖండ మెజార్టీ తో గెలిపించాలని బనగానపల్లె నియోజకవర్గ ప్రజలను కోరారు.కాటసాని ఓబుల్ రెడ్డి గారు,కాటసాని మేధా శ్రీ రెడ్డి గారు మాట్లాడుతూ బనగానపల్లె నియోజకవర్గ ప్రజలందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు . ఈ సంక్రాంతి పండుగ ను బనగానపల్లె పట్టణ ప్రజల మధ్యన జరుపుకోవడం చాలా ఆనందంగా వుందని చెప్పారు. ఇలాగే ప్రతి ఒక కుటుంబం సంతోషంగా వుండాలని తెలిపారు.