NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రక్తదానం చేయండి – ప్రాణదాతలు కండి

1 min read

– మాజీ ఎమ్మెల్యే బిసి జనార్దన్ రెడ్డి గారి సోదరుడు బిసి రామనాథ్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : పట్టణంలో దివంగత నేత నందమూరి తారక రామారావు 27వ వర్ధంతి సందర్భంగా” లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ “కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బనగానపల్లె పట్టణం లోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.అనంతరం బిసి రామనాథ్ రెడ్డి గారు మాట్లాడుతూ వివిధ ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి అవసరమైన వారికి గ్రూపు సంబంధించిన రక్తం లభించక ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చోటు చేసుకుంటుడటం తో యువకులు సమాజం లో చెడు అలవాట్లకు దూరమై ఇటువంటి మంచి కార్యక్రమాలకు చేయూతనిస్తూ ప్రోత్సహిస్తూ,ఇలాంటి కార్యక్రమాలలో ముందు ఉండి,ప్రోత్సాహించాలని పేర్కొన్నారు.ఇటువంటి కార్యక్రమాలకు ప్రతి ఒక్కరు సహకరించాలని ఒకరిని చూసి ఇంకొకరు కార్యక్రమాలు చేయాలని ఆసక్తి వస్తుందని చెప్పారు.రక్తదాన కార్యక్రమంలో యువకులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేయడం జరిగిందని అలాగే రక్తదానం చేసిన వారికి ప్రశంస పత్రాలు అందజేయడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమం లో భారీ గా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు,బీసీ జనార్దన్ రెడ్డి అభిమానులు, పాల్గొన్నారు.

About Author